బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫిక్షనల్ క్యారెక్టర్ లో నటించిన 'క్రిష్'3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సషనల్ సక్సెస్ ని అందుకున్నాయి.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,రాకేష్ రోషన్ దర్శకత్వం వహించనున్న 'క్రిష్-4' జూన్ నుండి ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించనుంది అని ఫిలింఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు స్టార్ హీరో రోషన్ ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం,హృతిక్ 'విక్రమ్ వేద' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.సెప్టెంబర్ 30,2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మరో చిత్రం 'ఫైటర్' కూడా సెప్టెంబర్ 28,2023న థియేటర్‌లలో విడుదల చేయడానికి లాక్ చేయబడింది.'క్రిష్-4' ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa