పూనమ్ కౌర్ ... ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఈ మధ్య బాగా ఫేమస్ అయిన టాలీవుడ్ నటి. సోషల్ మీడియాలో చేసే ట్వీట్స్,పోస్ట్స్, కామెంట్స్ ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు పూనమ్.
చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం నాతిచరామి. ఈ మధ్యనే విడుదలై ఫర్వాలేదనిపించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తనకు మొదట్లోనే హీరో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినా కుటుంబానికి ఇష్టం లేకపోవటంతో చేయలేదట. టాలీవుడ్లో కింగ్ నాగార్జున అంటే తనకెంతో ఇష్టమని, మెగా ఫ్యామిలి అంటే చాలా గౌరవం అని తెలిపింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కూడా పూనమ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్ పరంగా మంచి ప్రైమ్ టైములో ఉన్న హీరో ప్రభాస్ బాహుబలి కోసం దాదాపు అయిదు సంవత్సరాలు కేటాయించటం చాలా గ్రేట్ అని, అలాంటి క్యారెక్టర్ మరే హీరోకి కూడా ఉండదని తెలిపింది. నమ్మిన వాళ్ళ కోసం నిలబడే క్యారెక్టర్ ప్రభాస్ సొంతం అని ప్రశంసించింది పూనమ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa