ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీరకట్టులో అదా శర్మ ఫిదా చేసింది

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 04, 2018, 02:03 PM

హార్ట్ ఎటాక్, సుమణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అదా శర్మ.. చీరకట్టులో ఫిట్‌నెస్ ఛాలెంజ్‌తో అందర్నీ ఫిదా చేసింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు స్పందిస్తోన్న వేళ.. అదా తనదైన శైలిలో బదులిచ్చింది. అందరూ జిమ్‌‌లో భారీ కసరత్తులు చేస్తుంటే.. ఈ తమిళ కుట్టి మాత్రం చీరకట్టులో ముద్గల్ (కర్రల)తో కసరత్తులు చేసి ఫుల్ మార్కులు కొట్టేసింది. ఈ వీడియో కొద్ది గంటల్లోనే భారీగా వ్యూస్ సంపాదించింది. 


ఇది ఫిట్ ఇండియా ఛాలెంజ్ కాబట్టి భారతీయ మహిళలాగే చీరలో కసరత్తులో చేస్తున్నానని అదా శర్మ తన కసరత్తుల వీడియోను పోస్ట్ చేసింది. ఇతర నటీమణులెవరూ చీరలో కసరత్తులు చేసి నా కాన్సెప్ట్ కాపీ కొట్టదని సరదాగా సూచించింది. ‘‘శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం జిమ్‌కే వెళ్లాల్సిన పని లేదు. ఇటీవలే నేను మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతమైన అఖాడా వెళ్లాను. వాళ్ల ఫిట్‌నెస్ చూసి ఫిదా అయిపోయాను. అక్కడి ప్రజలు తమ శరీర బరువుతోనే సింపుల్‌ ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. అందులో ముద్గల్ ఒకటి. 


ముద్గల్‌ను ప్రాచీన కాలం నుంచి భారత్‌లో ఉపయోగిస్తున్నారు. దీని వల్ల కండరాలు బలపడతాయి. భుజాల సౌలభ్యం పెరుగుతుంది. వెన్ను బలంగా మారుతుంది. ఆరు నెలలుగా ముద్గల్‌తో ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నా’’నని అదా శర్మ చెప్పింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లందరికీ ఈ హీరోయిన్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa