ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్-హరీష్ శంకర్ సినిమా అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 11:43 AM

'భీమ్లానాయక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'భవదీయుడు భగత్ సింగ్'చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు.ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ మూవీలో పవన్ కళ్యాణ్‌ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా నటించనుంది.ఈ సినిమాలో అవార్డ్ విన్నింగ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ సినిమా జూన్ నెల నుండి హైదరాబాద్‌లో రోలింగ్‌ను ప్రారంభించనుంది అని ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.పవర్ స్టార్ అభిమానులు పవన్ అండ్ హరీష్ కాంబో లో రానున్న సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ పవర్ ఫుల్ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa