పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు స్పెయిన్‌లో సర్జరీ అయినట్లు తెలుస్తోంది. ‘సలార్’ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రభాస్ గాయపడగా.. డాక్టర్లు చిన్న ఆపరేషన్ చేసి, విశ్రాంతి తీసుకోమని సూచించారట. ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్.. త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవలే విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ఇంకా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్-కే , సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ చిత్రాలు చేస్తున్నాడు. వీటితోపాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa