ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనసూయ ను ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 10:31 AM

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఇకపోతే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మల్లెమాల కృషి ఎంతో ఉందని చెప్పాలి.అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సార్లు మల్లెమాల వారిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు స్కిట్లు పరిమితులు దాటి ఉండటం,లేదా ఎడిటింగ్ విషయంలో జరిగిన పొరపాటు కారణంగా మల్లెమాల వారిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


అయితే తాజాగా ఈ కార్యక్రమంలో అనసూయ ఓ తప్పు చేసి అడ్డంగా దొరికిపోయింది. గత ఎపిసోడ్లో అనసూయ హైపర్ ఆది స్కిట్ గురించి ఇంట్రో ఇస్తూ హైపర్ ఆది భాషా సినిమా నుంచి ఓ అద్భుతమైన స్కిట్ ద్వారా మన ముందుకు రాబోతున్నారని తెలిపారు. ఇలా భాషా సినిమా గురించి అనసూయ ఇంట్రో ఇస్తే హైపర్ ఆది స్కిట్ లో చేసింది మాత్రం ఇంద్ర స్పూఫ్ చేశారు. మరి ఈ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈఇంట్రోలో జరిగిన తప్పును నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలు పెట్టారు.


 


ఈ క్రమంలోనే నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ...భాష సినిమా స్ఫూప్ అన్నారు.. ఇంద్ర సినిమా చేశారేంటి? భాష సినిమాలోకి ఇంద్ర వచ్చిందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా అనసూయ తప్పుగా మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు. అయితే ఈ తప్పు మాత్రం తప్పనిసరిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారిదేనని, వారు చూసుకోకుండా ఉండటం వల్లే ఈ తప్పు జరిగిందని తెలుస్తోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa