రంగస్థలం, మహానటి, అభిమన్యుడు మూవీలతో హ్యాట్రిక్ విజయాలు సాధించిన హీరోయిన్ సమంత.. వివాహమైన తర్వాత నటించిన ఈ మూవీలు మూడు బ్లాక్ బస్టర్స్ కావడం విశేషం.. ఈ విజయాలతో ఆమె జోరు మీదున్నది.. తాజాగా ఆమె మూడు మూవీలలో నటిస్తున్నది.. తమిళంలో సీమరాజా, సూపర్ డీలక్స్ చిత్రాలతో పాటు తెలుగులో యు టర్న్ మూవీలో నటిస్తున్నది.. ఈ మూడు మూవీలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.. దీనిపై సమంత స్పందిస్తూ, ‘ఈ ఏడాది ఫస్టాఫ్ అద్భుతంగా గడచిపోయింది. సెకండాఫ్ కి రెడీ అవుతున్నాను’ అంటూ ట్విట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa