ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజా : ఎన్టీఆర్- త్రివిక్రమ్ యొక్క అరవింద సమేత విషయాలు

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 10, 2018, 05:50 PM

త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు అంటే.. అది ఎప్పుడు విడుదలవుతుందో.. డైరెక్ట్ చేసే ఆయనకే క్లారిటీ ఉండదు. అంత నెమ్మదిగా సినిమాలు చేసే త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి అరవింద సామెత -వీర రాఘవ సినిమా షూటింగ్ ని ఏకధాటిగా కానిచ్చేస్తున్నాడు. మరి ఎన్టీఆర్ డెడ్ లైన్ పెట్టాడో… లేకపోతె త్రివిక్రమ్ కావాలనే ఇలా ఆఘమేఘాల మీద సినిమాని పూర్తి చేస్తున్నాడో కానీ ఎన్టీఆర్ అరవింద సామెత షూటింగ్ మాత్రం గ్యాప్ లేకుండా కొనసాగుతుంది. ఎంత స్పీడు అనుకుంటున్నారు.. హీరోయిన్ పూజ హెగ్డే సీన్స్ మొత్తం చిత్రీకరణ పూర్తయ్యింది అంటే సినిమా షూటింగ్ ఎంత వేగంగా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.

మరి అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాని మొదలుపెట్టడానికి బాగా గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ఆ గ్యాప్ లో పూర్తి స్క్రిప్ట్ తో నే ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ మీదకెళ్లాడనే ప్రచారం ఉంది. మరి ఎంతగా స్క్రిప్ట్ రెడీ గా ఉన్నా… త్రివిక్రమ్ చాలా నీట్ గా, చాలా స్లో గా షూటింగ్ చేస్తాడు. మరి ఇంత కంగారుగా ఎన్టీఆర్ షూటింగ్ ని చక్కబెట్టేస్తున్నాడు అంటే…. ఎన్టీఆర్ ని ఈ సినిమాతో ఒకదారికి తెచ్చేస్తాడేమో అనే భయంలో ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు. మరి త్రివిక్రమ్ కి అజ్ఞాతవాసి సినిమా ఎఫెక్ట్ ఉండనే ఉంది. అలాగే మరోపక్క ఛల్ మోహన రంగ స్టోరీ విషయంలోనూ త్రివిక్రమ్ సఫర్ అయ్యాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విషయంలోనూ ఎమన్నా తేడా జరిగితే త్రివిక్రమ్ ఫెట్ ఎలా ఉంటుందో అనేది ఊహించడానికి కష్టమే.

మరి మాటల మాంత్రికుడు ఎన్టీఆర్ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో అనేది ఒక టీజర్, ట్రైలర్ గాని బయటికొస్తే తప్ప పక్క క్లారిటీ ఉండదన్నమాట. ఇక త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాకి దసరా టార్గెట్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా… సీనియర్ హీరోయిన్ (పేరు బయటికి రాలేదు) ఒక కీ రోల్ లో నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa