ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను భారతీయురాలినని చెప్పడానికి గర్వపడుతున్నా: ప్రియాంక చోప్రా

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 10, 2018, 06:01 PM

నటి ప్రియాంక చోప్రా అమెరికన్‌ షో క్వాంటికో పాపులర్‌ అయిన విషయం విదితమే. ఐతే ఈ షో తాజా ఎపిసోడ్‌లో కొందరు భారత జాతీయులను ఉగ్రవాదులుగా చూపడంపై ప్రతివిమర్శలు చెలరేగింది. కశ్మీర్‌లో ఓ కీలక సమావేశానికి ముందు మాన్‌హటన్‌లో ఉగ్రదాడికి పాల్పడి, దానిని పాక్‌ మీదికీ నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ ఎపిసోడ్‌లో చూపించారు. దీనిపై భారీ ఎత్తున విమర్శలు రావడంతో ప్రియాంకా క్షమాపణ చెబుతూ ట్వీట్‌ చేసింది. క్వాంటికోలో తాజా ఎపిసోడ్‌లో కొందరి మనోభావాలు దెబ్బతినడం నన్ను చాలా బాధించింది. ఉద్వేశపూర్వకంగా లా చేయలేదు. మనస్ఫూర్తిగా చెబుతున్నా.. నేను భారతీయురాలినని చెప్పడానికి గర్వపడుతున్నా. అది ఎప్పటికీ మారదని ప్రియాంకా ఆ ట్వీట్‌లో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa