ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ సర్‌ప్రైజ్: మీసకట్టులో ‘అందగాడు’

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 11, 2018, 10:13 AM

ప్రిన్స్ మహేష్ బాబు సర్‌ప్రైజ్ చేశారు. ‘భరత్ అనే నేను’ చిత్రం తరువాత వంశీ పైడిపల్లి చిత్రంకోసం కొత్త కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ నున్నని షేవ్‌లో మిల్కీ బాయ్‌లా ఉండే మహేష్‌ ఈ సినిమా కోసం గెడ్డం, మీసం పెంచుతున్న ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. తాజాగా మూవీ ఆర్టిస్ట్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సరికొత్త లుక్‌తో సర్‌ప్రైజ్ చేశారు. 


సినిమాల పరంగా ప్రయోగాలు చేసే మహేష్.. లుక్ పరంగా ఇప్పటి వరకూ పెద్దగా ప్రయోగాలు చేయలేదు. తాజాగా తన 25వ సినిమాకి ఇంతకు ముందెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. మీసకట్టులో మహేష్ మరింత అందంగా కనిపించారు. 24 క్రాఫ్ట్స్‌లో ముఖ్య‌మైన విభాగాల్లో తెలుగు మూవీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ ఒక‌టి.. ఈ యూనియ‌న్ నేటితో (జూన్ 10) 25 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారీగా ఈవెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లోని అన్న‌పూర్థా స్టూడియో ఈ వేడుకకు వేదికైంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa