టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్. గత మూడేళ్ళుగా ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఆర్ ఆర్ ఆర్ ఈ రోజు ధియేటర్లలోకొచ్చింది. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ ఆహా! ఓహో ! అద్భుతం! అంటుంటే ఒక వ్యక్తి మాత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమాను తీసిన రాజమౌళికి జైలు శిక్ష విధించాలని సంచలన వ్యాఖ్యలు చేసాడు. అతనే కమల్ ఆర్ ఖాన్.
కమల్ ఆర్ ఖాన్... పూర్తి పేరు కమల్ రషీద్ ఖాన్. ఈయన బాలీవుడ్ నటుడు, నిర్మాత, రచయిత. ఈయన తన సినీ కెరీర్లో కేవలం ఒకే ఒక్క సినిమాలో హీరోగా నటించాడు. అది కూడా తన సొంత సినిమా దేశ్ ద్రోహి. బాలీవుడ్ సినీ చరిత్రలో ఈ సినిమా ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. కమల్ సినిమాల్లో కనిపించేది చాలా తక్కువ, వివాదాస్పద రివ్యూ లతో బాగా ఫేమస్. అయితే ఇతని రివ్యూలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే తాజాగా కమల్ ఆర్ ఆర్ ఆర్ మూవీ రివ్యూ ఇచ్చాడు.
"ఆర్ ఆర్ ఆర్ మూవీకి తలా తోకా ఏమీ లేదు. భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి చెత్త సినిమాను ఇప్పటివరకు నేను చూడలేదు. ప్రేక్షకులు బ్రతికుండగానే వారి మెదడులను పని చేయకుండా చేస్తుంది ఈ సినిమా. సుమారు 600 కోట్ల భారీ తప్పిదాన్ని చేసిన రాజమౌళిని ఆర్నెల్లు జైల్లో పెట్టాలి. ఆర్ ఆర్ ఆర్ ఒక డిజాస్టర్" అంటూ వరస ట్వీట్లు చేసి దక్షిణాది సినిమాలపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa