ఉభయ తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. నిన్న విడుదలైన ఈ సినిమా రికార్డ్ బ్రేక్ ఓపెనింగ్సును నమోదు చేసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతమని కొనియాడుతూ రాజమౌళి విజువల్ ను, తారక్, చరణ్ ల అమోఘమైన నటనను ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ ఆర్ ఆర్ బృందానికి శుభాకాంక్షలను తెలియజేయగా తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు.
ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాజమౌళి గారి విజన్ కి హ్యాట్సాఫ్. మెగా పవర్ నా అన్న రామ్ చరణ్ కెరీర్ లోనే ఉత్తమ నటనను ఈ సినిమాలో కనబరిచాడు. ఇక తారక్... నా బావ, పవర్ హౌస్, అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. నిజంగా ఇది ఒక కిల్ల"RRR"...అంటూ బన్నీ ట్వీట్ చేసాడు. ఇంకా ఆలియా భట్, అజయ్ దేవ్ గణ్, ఎం.ఎం కీరవాణి తదితరులకు శుభాకాంక్షలను తెలియజేసాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa