'రొమాంటిక్' సినిమాతో కేతిక శర్మ తెలుగు తెరకు పరిచయం అయింది. టైటిల్ తగటే రొమాంటిక్ గా కనిపించింది. హాట్ లుక్స్ తో అదరగొట్టింది. తొలి సినిమా రిలీజ్ కాకముందే.. ఈ బ్యూటీ కోసం పోటీపడి మరీ.. బుక్ చేసుకున్నారు. ఇప్పటికే నాగశౌర్య 'లక్ష్య' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడ్నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇందులో 'రంగ రంగ వైభవంగా' ఒకటి. వైష్ణవ్ తేజ్ హీరో. జూన్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ చేసినట్టు.. కెమెరా ముందుకొచ్చి హాట్ హాట్ పోజులిచ్చింది రొమాంటిక్ బ్యూటీ. ఇకజూన్ 1న 'రంగ రంగ వైభవంగా' సినిమాకు పోటీగా గోపీచంద్ 'పక్కా కమర్షియల్' రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. రాశీఖన్నా హీరోయిన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa