మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ కాంబో వచ్చే సినిమా కి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ తో నటించనున్నారు అని మేకర్స్ వెల్లడించారు. మారుతీ ఈ సినిమా స్క్రిప్టింగ్‌లో ఆసక్తికరమైన సబ్జెక్ట్‌ను రెడీ చేశాడు అని వెల్లడించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం మార్చి 10, 2022న ప్రారంభం కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ని వేసినట్లు సమాచారం. ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ పూర్తి చేసి 'సాలార్' షూటింగ్ ప్రారంభించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa