ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు అన్ని చోట్ల జేజేలు పలుకుతున్నారు. ఈ చిత్రంతో తెలుగు సినిమా పరిధి టాలీవుడ్ ను దాటి ఎప్పుడో పాన్ ఇండియా స్థాయికి విస్తరించింది. బాహుబలి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన రాజమౌళి... తాజాగా 'ఆర్ఆర్ఆర్' తో దాన్ని మరో మెట్టు ఎక్కించాడు. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.750 కోట్ల గ్రాస్ సాధించిన 'ఆర్ఆర్ఆర్'... రూ.1000 కోట్ల దిశగా పయనిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' తిరుగులేని విజయంతో చిత్రబృందం ఆనందోత్సాహాల్లో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 'ఆర్ఆర్ఆర్' టీమ్ కు హైదరాబాద్ లో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 'ఆర్ఆర్ఆర్' యూనిట్ సభ్యులందరూ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా వచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు సందడి చేస్తున్నాయి. సంగీత దర్శకుడు కీరవాణి కూడా విచ్చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa