టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. కొంతకాలం క్రితం రవితేజ తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈరోజు ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ రవితేజ మోషన్ పోస్టర్‌ని విడుదల చేసారు. అంతేకాకుండా తనకు స్పోర్ట్స్ జానర్ అంటే చాలా ఇష్టమని, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా ని ప్రదర్శించడం సంతోషంగా ఉందని రవితేజ తెలిపారు. చెల్లా అయ్యావు దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి ‘మట్టి కుస్తి’ అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ మూవీ మోషన్ పోస్టర్‌లో వివాహ ఆహ్వాన పత్రిక కూడా ఉంది. దానిపై ‘వీర వెడ్స్ కీర్తి’ అని రాసి ఉంది. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, అన్బరివ్ యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa