కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఎన్టీఆర్ 30" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాని గత ఏడాది ప్రకటించారు కానీ ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియాభట్ నటిస్తుంది. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అండ్ సినీప్రేమికులు అందరూ ఈ సినిమా గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, 'ఎన్టీఆర్ 30' సినిమాలో డ్రామా సూపర్ స్పెషల్ గా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ కంటే, ఇంటెన్స్ డ్రామా ప్రేక్షకులను స్టన్ చేసేలా ఉంటుంది అని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. 'ఎన్టీఆర్ 30' సినిమా షూటింగ్ జూన్ నెలలో జరగనుంది. 2023 ప్రారంభంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa