Virat Kohli గురించి మాజీ క్రికెటర్ Sanjay Manjrekar ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ దిగ్గజం Sachin Tendulkar మాదిరిగానే కోహ్లీ కూడా తన తప్పిదాన్ని సులభంగా అంగీకరించడని పేర్కొన్నాడు. గొప్ప బ్యాటర్లు సాధారణంగా తమ ఔట్‌కు ఇతర కారణాలను వెతుకుతారని అభిప్రాయపడ్డాడు.Indian Premier League 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గుడ్ లెంగ్త్ డెలివరీని అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ, ఔట్ అయిన తర్వాత పిచ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ రియాక్షన్ ఇచ్చాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్ ఛేజింగ్‌లో అతను డకౌట్ కావడం గమనార్హం.ఈ ఘటనపై స్పందించిన మంజ్రేకర్.. కోహ్లీ ఔట్ కంటే అతని స్పందనే ఎక్కువ ఆసక్తికరంగా అనిపించిందన్నాడు. “ఔట్ అయిన వెంటనే కోహ్లీ పిచ్‌ను చూసిన తీరు, సచిన్ టెండూల్కర్ గతంలో ప్రవర్తించిన విధానాన్ని గుర్తు చేసింది. బంతి అనూహ్యంగా ప్రవర్తించిందనే భావనతో వారు స్పందిస్తారు. అది గొప్ప బ్యాటర్ల మైండ్‌సెట్‌కు నిదర్శనం” అని చెప్పుకొచ్చాడు.గొప్ప ఆటగాళ్లు తమ సామర్థ్యంపై అపారమైన నమ్మకం కలిగి ఉంటారని, అందుకే వైఫల్యాల సమయంలో కూడా ఆత్మవిశ్వాసం కోల్పోరని మంజ్రేకర్ వివరించాడు. సాధారణ ఆటగాళ్లు మాత్రం ఇలాంటి సందర్భాల్లో త్వరగా నిరాశకు గురవుతారని చెప్పాడు. “విజేతలైన బ్యాటర్లు తమ వైఫల్యాన్ని భిన్నంగా స్వీకరిస్తారు. అదే వారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది” అని వ్యాఖ్యానించాడు.ఇక మ్యాచ్ అనంతరం ప్రిన్స్ యాదవ్ కూడా ఆసక్తికర విషయం వెల్లడించాడు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఒక నిర్దిష్ట లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని కోహ్లీ ఇచ్చిన సూచనలే తనకు ఉపయోగపడ్డాయని, అదే ప్లాన్‌తో అతన్ని ఔట్ చేయగలిగానని తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa