విశాఖపట్నంలోని పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై శనివారం ఉదయం 8 గంటలకు సుమారు 65 అడుగుల భారీ త్రిశూలం, ఢమరుకాన్ని ప్రారంభించనున్నట్లు వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విశాఖను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు. 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో కూడిన ఈ భారీ త్రిశూలం, ఢమరుకం కైలాసగిరిపై ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, ఇప్పటికే ఉన్న రోప్‌వే, గ్లాస్ బ్రిడ్జ్, జిప్ లైనర్లతో పాటు ఈ అద్భుత కట్టడం కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa