నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డ్‌లో తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ఘనంగా భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి NMD ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి తదితరులు పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనలతో ప్రారంభమైన ఈ వేడుకలో పార్టీ బలోపేతానికి ఇది కీలకమని నేతలు పేర్కొన్నారు. రెండు అంతస్తుల్లో 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భవనంలో మీటింగ్ హాల్స్, గ్రీవెన్స్ హాల్, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa