అసలు ఏమైంది అంటే, నిబంధనల ప్రకారం ఎంపికైన అథ్లెట్లు తమ రోజువారీ లొకేషన్ వివరాలను ముందుగానే అందించాల్సి ఉంటుంది. దీని ద్వారా డోపింగ్ నియంత్రణ అధికారులు ఎప్పుడైనా అనుకోకుండా వచ్చి పరీక్షలు నిర్వహించగలరు. అయితే, డిసెంబర్ 18న అధికారులు పరీక్ష కోసం వెళ్లినప్పుడు Vinesh Phogat అక్కడ అందుబాటులో లేకపోవడంతో ఈ ఘటన వివాదంగా మారింది.ఈ విషయంపై వినేష్ స్పందిస్తూ, ఆ సమయంలో తాను హర్యానా అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైనట్లు తెలిపారు. బెంగళూరు నుంచి చండీగఢ్‌కు ప్రయాణం కారణంగా తన షెడ్యూల్లో మార్పులు వచ్చాయని, అలాగే ఇటీవల బిడ్డకు జన్మనివ్వడం వల్ల వ్యక్తిగత బాధ్యతలు పెరిగాయని వివరించారు. అయితే, ఈ మార్పులను ముందుగానే అప్డేట్ చేయడంలో లోపం జరిగిందని అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ITA) స్పష్టం చేసింది.ఇక నిషేధం ముప్పు విషయానికి వస్తే, ప్రస్తుత పరిస్థితిలో ఇది నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడటం లేదు; కేవలం హెచ్చరిక మాత్రమే. కానీ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) నిబంధనల ప్రకారం, 12 నెలల వ్యవధిలో మూడు సార్లు ఇలాంటి పరీక్షలకు అందుబాటులో లేకపోతే లేదా సమాచారం ఇవ్వడంలో విఫలమైతే, అది ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. అప్పుడు గరిష్టంగా రెండేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది మొదటి సంఘటన కావడంతో తక్షణ శిక్ష ఉండదు.మరోవైపు, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన తర్వాత వినేష్ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే 2025 డిసెంబర్లో తిరిగి రింగ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. గోండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ద్వారా మళ్లీ పోటీల్లోకి అడుగుపెట్టాలని ఆమె ప్రణాళికలు వేసుకుంటున్నారు.ఈ సమయంలో వచ్చిన నోటీసులు ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ఈ విషయంపై స్పందించేందుకు ఐటీఏ ఆమెకు ఏడు రోజుల గడువు ఇచ్చింది. సరైన వివరణ ఇవ్వలేకపోతే, ఈ ‘మిస్డ్ టెస్ట్’ ఆమె రికార్డులో అధికారికంగా నమోదు కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa