ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాయితీపై సాగు యంత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. 28 జిల్లాలకు రూ.112.50 కోట్లు కేటాయించింది. ఈ మేరకు లబ్ధిదారుల అర్హతకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, సన్నకారు రైతులు, మహిళలకు 50 శాతం రాయితీతో ఇవ్వనుంది. మిగిలిన రైతులకు 40 శాతం సబ్సిడీ ఉంటుంది. అర్హులైన రైతులు ఈ సాగు యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa