ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ (SCoR) ఏర్పాటుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఈ జోన్ ఏర్పాటుకు అధికారిక హోదా లభించింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ కొత్త జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రైల్వే సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, కొత్త రైళ్లు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa