ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ గెలుపు ముందే చెప్పిన బుట్టబొమ్మ.. పూజా హెగ్డే ప్రెడిక్షన్ హిట్!”

national |  Suryaa Desk  | Published : Tue, May 05, 2026, 08:46 PM

తమిళనాడు ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్. అయితే ఈ మూవీ సెన్సార్ సమస్యల కారణంగా విడుదలకు ముందే వాయిదా పడింది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఏర్పడిన అడ్డంకుల వల్ల ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది.దీంతో ఈ సినిమా ఎన్నికలకు ముందు ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే మమితా బైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. హెచ్‌. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించింది.ఇక సినిమా విషయాన్ని పక్కన పెడితే, తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ విజయ్ వైపు చూపించినట్లు అందులో కనిపిస్తోంది. ఈ వీడియో జన నాయగన్ షూటింగ్ సమయంలో తీసినదిగా సమాచారం.వీడియోలో విజయ్ కొంచెం సిగ్గుపడుతూ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట హల్‌చల్ చేస్తుండగా, నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. “విజయ్ గెలుస్తాడని బుట్టబొమ్మకు ముందే తెలుసా?” అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు పూజా హెగ్డే కాన్ఫిడెన్స్‌ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa