జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ నగర శివారులో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఒకరిని ఎలా హత్య చేయాలి” అని గూగుల్‌లో సెర్చ్ చేసిన ఆధారాలతో ఇద్దరు వ్యక్తులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.వివరాల్లోకి వెళ్తే, చింతల్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శివారెడ్డి అనే వ్యక్తికి అరుణ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. గత పదేళ్లుగా వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల అరుణ తన కుమారుడితో కలిసి శివారెడ్డిని గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తరలించే ప్రయత్నంలో ఉండగా వారు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో తల్లి–కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం ప్రకారం, గుర్లపల్లి అరుణ, శివారెడ్డి గత 8–10 సంవత్సరాలుగా సంబంధంలో ఉన్నారని, గత 10 నెలలుగా చింతల్‌లో కలిసి నివసిస్తున్నారని వెల్లడించారు. మృతుడు మద్యం మత్తులో అరుణను, ఆమె కుమారుడిని తరచూ వేధిస్తూ శారీరక దాడులకు పాల్పడేవాడని తెలిపారు. ఈ నేపథ్యంలో అతన్ని తొలగించాలని నిర్ణయించుకున్న వారు పథకం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో, మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు వివరించారు.హత్యకు ముందు అరుణ కుమారుడు సాయి రత్నం గూగుల్‌లో “హత్య ఎలా చేయాలి” అనే విషయాన్ని సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే స్థానిక చికెన్ దుకాణం నుంచి తప్పుడు కారణాలతో కత్తి కొనుగోలు చేసినట్లు కూడా విచారణలో తేలింది.హత్య అనంతరం రక్తపు మరకలను శుభ్రం చేసి, దుస్తులను సమీపంలోని మురుగు కాలువలో పారవేశారు. మృతదేహాన్ని చాప, ప్లాస్టిక్ కవర్లలో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేయడానికి సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే జీడిమెట్ల పోలీసులు వేగంగా స్పందించడంతో ఈ ప్రయత్నం విఫలమై, మృతదేహాన్ని పారవేసే పథకం భగ్నమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa