Vivo X300 FE: వివో తన ఎక్స్ 300 సిరీస్‌లో కొత్త బేసిక్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కాంపాక్ట్ సైజ్‌తో పాటు స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్ల కలయికగా ఈ ఫోన్‌ను విడుదల చేసింది.లుక్స్ పరంగా సింపుల్‌గా కనిపించినప్పటికీ, పనితీరు మరియు కెమెరా విషయంలో ఈ స్మార్ట్‌ఫోన్ హై-ఎండ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక ఈ ఫోన్ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.
*ప్రైస్ : Vivo X300 FE రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 12GB + 256GB మోడల్ ధర రూ. 79,999గా ఉండగా, 12GB + 512GB వేరియంట్ రూ. 89,999గా ఉంది. లీలాక్ పర్పుల్, నోయిర్ బ్లాక్, అర్బన్ ఆలివ్ వంటి మూడు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
*సేల్ & ఆఫర్స్ : ఈ ఫోన్ మే 14 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. Amazon, Flipkart మరియు వివో అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఆఫర్లలో భాగంగా HDFC, SBI, Axis బ్యాంక్ కార్డులు మరియు UPI చెల్లింపులపై 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ. 5,000 ఎక్స్‌చేంజ్ బోనస్, 24 నెలల నో-కాస్ట్ EMI, ఒక సంవత్సరం ఎక్స్‌ట్రా వారంటీ కూడా అందిస్తున్నారు.
*ఫీచర్స్ : Vivo X300 FE 6.31 ఇంచ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్, HDR10+ సపోర్ట్ కలిగి ఉంటుంది.ఈ డివైస్‌లో Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను అందించారు. 12GB LPDDR5X ర్యామ్‌తో పాటు 512GB వరకు స్టోరేజ్ సపోర్ట్ ఉంది.కెమెరా సెటప్‌లో 50MP (Sony IMX 921) ప్రైమరీ సెన్సార్, 50MP ZEISS టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP ZEISS వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా అందించారు. 4K వీడియో రికార్డింగ్‌తో పాటు AI ఆధారిత కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి.బ్యాటరీ విషయానికి వస్తే, 6500mAh కెపాసిటీతో ఈ ఫోన్ మంచి బ్యాకప్ ఇస్తుంది. 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అలాగే IP68, IP69 రేటింగ్స్‌తో నీరు, దుమ్ము నుంచి రక్షణ కూడా అందిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa