టీమిండియా మాజీ స్టార్ Yuvraj Singh సోషల్ మీడియాలో తన శిష్యులపై సరదాగా సెటైర్లు వేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు తనకు అండగా నిలిచిన గురువుకి కృతజ్ఞతగా Rishabh Pant ఒక ఖరీదైన గోల్ఫ్ క్లబ్‌ను గిఫ్ట్‌గా అందించాడు.ఈ బహుమతిని చూసిన యువీ, Shubman Gill, Abhishek Sharmaలను ట్యాగ్ చేస్తూ, “కొంచెం సిగ్గు తెచ్చుకోండి.. పంత్‌ను చూసి నేర్చుకోండి” అంటూ ఫన్నీగా ఆటపట్టించాడు.
*రిషబ్ పంత్ ఎమోషనల్ గిఫ్ట్ : గత కొంతకాలంగా ఫామ్ కోసం పోరాడుతున్న పంత్, టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత, ఐపీఎల్ 2026కి ముందు యువరాజ్ సింగ్‌ను కలిసి మార్గదర్శనం కోరాడు. తన మెంటల్ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ పెరగడానికి యువీ సహాయం చాలా ఉపయోగపడిందని పంత్ భావించాడు.ఆ కృతజ్ఞతగా, రిటైర్మెంట్ తర్వాత గోల్ఫ్ ఆడుతున్న యువీకి ప్రత్యేకంగా గోల్ఫ్ క్లబ్‌ను గిఫ్ట్‌గా పంపించాడు. దానితో పాటు రాసిన నోట్‌లో, “ప్రియమైన యువీ పాజీ, మీ సపోర్ట్, గైడెన్స్‌కు ధన్యవాదాలు. గోల్ఫ్ కోర్స్‌లో కలుద్దాం” అని పేర్కొన్నాడు.
*గిల్, అభిషేక్‌లపై సరదా సెటైర్లు :ఈ గిఫ్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన యువరాజ్, తన వద్ద శిక్షణ పొందిన ఇతర యువ ఆటగాళ్లపై సరదాగా వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా గిల్‌ను “నంబర్ 2 బేషరమ్”, అభిషేక్ శర్మను “నంబర్ 1 బేషరమ్” అని పిలుస్తూ చమత్కరించాడు.అలాగే ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నమన్ ధీర్, అబ్దుల్ సమద్, ప్రియాన్ష్ ఆర్యలను కూడా ట్యాగ్ చేస్తూ పంత్‌ను చూసి నేర్చుకోవాలని సరదాగా చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
*పంత్ ప్రదర్శనపై నిరాశ : అయితే, యువరాజ్ సింగ్ మార్గదర్శకత్వం ఉన్నప్పటికీ, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌ల్లో 204 పరుగులు మాత్రమే సాధించాడు. ఆయన సగటు 25.50గా ఉండగా, స్ట్రైక్ రేట్ 128.30గా నమోదైంది.పంత్ ఫామ్ లేకపోవడంతో పాటు, అతని జట్టు కూడా 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa