కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజా కార్యక్రమం జరిగింది. ఆర్ & బి క్వార్టర్స్ సమీపంలో, చర్చ్ ఎదురుగా, సి. క్యాంప్ సర్కిల్, నంద్యాల్ రోడ్‌లో ఈ నిర్మాణం చేపట్టారు. జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కే. ఈ. ప్రభాకర్, కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షత వహించగా, మంత్రాలయం టిడిపి ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నూతన కార్యాలయం జిల్లా నాయకులు, కార్యకర్తలకు సమన్వయ వేదికగా మారి పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa