తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే విజయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా, అది వాయిదా పడింది. రాష్ట్రంలోని 234 సభ్యుల అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది.మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు ఇంకా 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో మరో 5 స్థానాలు జతకాగా, మొత్తం సంఖ్య 113కి చేరింది.ఇంకా మెజారిటీ సాధించడానికి అవసరమైన సీట్ల కోసం పీఎంకే, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే వంటి చిన్న పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుగా మెజారిటీ మద్దతు నిరూపించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సూచించారు.ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వాలంటే, అవసరమైన మద్దతుకు సంబంధించి పత్రాల రూపంలో ఆధారాలు సమర్పించాలని గవర్నర్ పట్టుబట్టారు. దీంతో టీవీకే ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రణాళికలో మార్పులు చోటుచేసుకున్నాయి.మొదట విజయ్‌తో పాటు నలుగురు సీనియర్ నేతలు ప్రమాణం చేసి, తరువాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపణకు రెండు వారాల గడువు కోరాలని పార్టీ భావించింది.ఇక, టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జునా ఇవాళ రాత్రి గవర్నర్‌ను మరోసారి కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు అనుమతి కోసం మరో ప్రయత్నం చేస్తూ, తగిన సమయం ఇస్తే 118 మంది ఎమ్మెల్యేల పూర్తి మద్దతు సమీకరిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa