బ్రిటానియా ఇండస్ట్రీస్ తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. పిండి, కోకో, పామ్ ఆయిల్ వంటి ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కాగా, కంపెనీ ప్రకటన అనంతరం స్టాక్ మార్కెట్‌లో బ్రిటానియా షేర్లు తీవ్ర ఒత్తిడికి గురై, ఒక దశలో 5 శాతం వరకు క్షీణించాయి. ముడి పదార్థాల వ్యయభారం కారణంగా ఎఫ్‌ఎంసీజీ రంగంలో ధరల పెంపు ఒత్తిడి మరింత పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa