రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో టెక్నాలజీ వినియోగంపై సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం చేయాలని, కార్యాలయాల చుట్టూ తిరిగే సమయాన్ని తగ్గించాలని ఆయన కోరారు. ఆన్‌లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదని, పాలన సులభతరం అవుతుందని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్‌తో పౌరసేవలపై ఇప్పటికే 29 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, 90 శాతం ప్రభుత్వ సేవలు వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయని, డిసెంబర్ నాటికి అన్ని సేవలను వాట్సాప్‌లో అందించాలని ఆదేశించారు. స్మార్ట్ ఫోన్లు లేని కుటుంబాలు 34 శాతంగా ఉన్నాయని, ఆన్‌లైన్ సేవల ద్వారా అవినీతి, దుర్వినియోగం తగ్గుతాయని చెప్పారు. అవేర్ 2.0 సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని, పిడుగులు, తుఫాన్ల హెచ్చరికలను నేరుగా మొబైళ్లకు పంపాలని సూచించారు. సీవీడ్ సాగుపై, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అక్రమ కట్టడాలపై దృష్టి సారించాలని కలెక్టర్లకు ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa