ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మంగళవారం షాక్ తగిలింది. వర్మ తాజా చిత్రం డేంజరస్‌ను ప్రదర్శించేందుకు పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఈ విషయాన్ని స్వయంగా వర్మనే కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇద్దరు మహిళల మధ్య స్వలింగ సంపర్కం నేపథ్యంలో డేంజరస్ చిత్రాన్ని వర్మ రూపొందించారు.
నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రదర్శించలేమంటూ పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ తేల్చిచెప్పేశాయి. తన సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అనుమతి లభించిన అంశాన్ని ప్రస్తావించిన వర్మ... ఈ రెండు సినిమా థియేటర్లు తన సినిమా ప్రదర్శనకు తిరస్కరించి స్వలింగ సంపర్కులను అవమానించాయంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa