పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "భీమ్లా నాయక్". మరి పవన్ కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా విడుదల వరకు ఎన్నో ట్విస్ట్ లు పడ్డాయనే చెప్పాలి. అయితే ఈ చిత్రాన్ని హిందీలో యూఫోరియాలో విడుదల చేయనున్నట్టు నిర్మాత నాగవంశీ ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే మార్చి మొదటి వారంలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఏప్రిల్‌కి వాయిదా పడింది. అయితే ఏప్రిల్ వచ్చినా హిందీలో సినిమా విడుదలపై ఎలాంటి సందడి లేదు. దాంతో హిందీ విడుదలకు సంబంధించి ఆగిపోయినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa