ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యష్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ కేజిఎఫ్. 2018లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విడుదలైన అన్ని చోట్ల రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కేజిఎఫ్ కు రెండో భాగం గా వస్తున్న కేజిఎఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావటానికి సిద్ధంగా ఉంది.
ఈ సినిమా పట్ల తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి గా ఉన్నారు. ఈ మూవీ నైజాం హక్కులను దాదాపు రూ. 50 కోట్ల భారీ మొత్తాన్ని నిర్మాతలకు చెల్లించి, పోటీపడి మరీ దక్కించుకున్నాడట టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. నైజాం లో భారీ ఎత్తున కేజిఎఫ్ చాప్టర్ 2 ను విడుదల చేసే పక్కా ప్రణాళికను దిల్ రాజు రూపొందిస్తున్నారట. పోతే... కేజిఎఫ్ చాప్టర్ 2 నుండి ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్, సాంగ్స్ అంచనాలకు మించి ఉండటంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామా అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa