కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత, ఈ స్టార్ దర్శకురాలు తన తదుపరి సినిమా గురించి ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమా కూడా మళ్లీ స్టార్ హీరో సూర్యతోనే చేస్తున్నట్లు చెప్పింది. ఈ సినిమా బయోపిక్ కాదని, నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తీస్తున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురి నుండి మరో బ్లాక్ బస్టర్ మూవీని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa