ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ తేదీన విడుదల కానున్న 'రామారావు ఆన్ డ్యూటీ' మొదటి పాట

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 06:32 PM

శరత్ మండవ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ "రామారావ్ ఆన్ డ్యూటీ" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనుండగా, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా మొదటి సింగిల్ బుల్బుల్ తరంగ్ ఏప్రిల్ 10న విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు. పోస్టర్‌లో రవితేజ, రజిషా ఇద్దరూ కూల్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రంలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్ర లోకేష్ మరియు జాన్ విజయ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa