నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ 'బీస్ట్'. పూజా హెగ్డే కధానాయిక. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 13 న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ భాగంగా హైదరాబాద్‌లో బీస్ట్ మూవీ బృందం ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ , అనిరుద్ , పూజా హెగ్డే , నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో 'హలమితి హబిబో' పాటకి పూజాహెగ్డేతో డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ అనిరుధ్ కలిసి డ్యాన్స్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa