గురువారం నాడు రామ్ గోపాల్ వర్మ బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన నైనా గంగూలీ.. వర్మను ముద్దుపెట్టుకుంది. ఓ చేతిలో మందు గ్లాసు, మరో చేతిలో నైనాను పట్టుకుని ఆర్జీవీ ఫుల్ ఎంజాయ్ చేశారు. సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే. తన సినిమాలతోనే కాకుండా క్యారెక్టర్‌తోనూ అందరి దృష్టి ఆకర్షిస్తుంటారు. ఆయన తెరకెక్కించిన డేంజరస్ వాయిదా పడటంతో మరోసారి వార్తల్లోకెక్కారు. తన పుట్టినరోజే ఈ విధంగా సినిమా వాయిదా పడటం గమనార్హం. అయితే గురువారం ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి డేంజరస్ మూవీ హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సర రాణి సహా పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. తన బర్త్ డే వేడుకలో ఆర్జీవీ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.
పుట్టిన రోజున ఎంజాయ్ చేసిన వర్మ.. ఓ చేతిలో మందు గ్లాసు,, మరో చేతిలో నైనా గంగూలీని పట్టుకున్నాడు. ఈ సందర్భంగా నైనా హ్యాపీ బర్త్‌డే అంటూ అతడి బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ వీడియోను స్వయంగా నైనా గంగూలీనే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.
ఆయన తెరకెక్కించిన డేంజరస్ సినిమా ఏప్రిల్ 8న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. స్వలింగ సంపర్కులైన ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథగా వర్మ తెరకెక్కించారు. క్రైమ్ బ్యాక్ డ్రాప్‌లో కథ సాగుతుందని ఆర్జీవీ ఇప్పటికే చెప్పారు. అయితే ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు థియేటర్ల యజమానులు ముందుకురావడం లేదు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ చిత్రాన్ని తమ సినిమాల్లో ప్రదర్శించబోమంటూ వర్మకు షాకిచ్చాయి. దీంతో తన అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తన సినిమా విడుదల నిరాకరించడం సెక్షన్ 377పై సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును వ్యతిరేకించడమనే అని ఆయన స్పష్టం చేశారు.
Yesterday night scenes from @RGVzoomin Sir's Birthday Bash. pic.twitter.com/DGDEmtxhlX
— Naina Ganguly (@NainaGtweets) April 8, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa