మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ కాంబో వచ్చే సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో అనుష్క, కృతి శెట్టి, శ్రీలీల, మాళవిక మోహనన్‌లు కథానాయికలుగా నటించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బొమన్ ఇరానీ లేదా పరేష్ రావల్ ముఖ్యమైన పాత్రలో కనిపించవచ్చు అని సమాచారం. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10వ తేదీన లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా లాంచ్ వాయిదా పడినట్లు సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా లాక్ చేయబడలేదని ఇంకా మరికొన్ని లాజిస్టికల్ కారణాలు కూడా లాంచ్ వాయిదాకి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్యాక్ ఎండ్ పనులు పూర్తయ్యాక సినిమా ప్రారంభించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa