క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. ఇందులో వీరమల్లు అనే పేరు మోసిన దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నారు. ఆయన సరసన యువరాణిగా నిధి అగర్వాల్, మరో కీలక పాత్రలో నర్గీస్ ఫక్రీ కనిపించనున్నారు. ఈ సినిమాలో కోహినూర్ వజ్రానికి సంబంధించిన ఎపిసోడ్ హైలైట్ అవనుందని తెలుస్తోంది. చాలా కాలం వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం పున: ప్రారంభం అయింది. తోటతరణి వేసిన భారీ సెట్‌లో పవన్ 1000 మంది ఫైటర్లతో తలపడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాటం చూసి పవన్ అభిమానులకు గూస్ బంప్స్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. షూటింగ్‌కు సంబంధించి పవన్ యుద్ధ విన్యాసాలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.