టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక్కపాట చిత్రీకరణ మిగిలుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను ముందు ప్రకటించిన విధంగా మే 12న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో మహేశ్‌బాబు సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది. పరశురామ్ దర్శకత్వం వహించాడు.

అయితే.. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ సూపర్‌హిట్ టాక్ కొట్టేశాయి. కళావతి పాటైతే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఆ పాటలో మహేష్ వేసిన స్టెప్స్‌కు చాలా మంది ఫిదా అయ్యారు. మరెంతో మంది ఆ స్టెప్స్ వేయడానికి ప్రయత్నించారు.
ఇక ప్రిన్స్ కూతురు సితార స్పెషల్ అప్పియరెన్స్‌తో వచ్చిన మరో పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నెల 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్ల వేగం పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మరొక్క పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు ఓ అప్‌డేట్‌ను మహేష్ ఫ్యాన్స్‌కు ఇచ్చింది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేపట్టాలని నిర్ణయించారు. సర్కారు వారి పాటలో మహేష్ సరసన కీర్తి సురేశ్ నటించిన విషయం తెలిసిందే. పరుశురాం దర్శకత్వం వహించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa