తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.
ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారంటూ ఈ సినిమాను తమిళనాడులో నిషేధించమని ఆ రాష్త్ర ముస్లింలీగ్ అధ్యక్షుడు ముస్తఫా తమిళనాడు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కి లేఖ రాసిన విషయం తెలిసిందే. పోతే... ఇంతకుముందు బీస్ట్ సినిమాను కువైట్ లో కూడా నిషేధించారు. తాజాగా ఇదే కారణంతో ఈ సినిమాని ఖతార్ లో కూడా నిషేధించినట్టు తెలుస్తోంది. ఇస్లామిక్ టెర్రరిజం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కిందనీ, ఇలాంటి సినిమాకు తమ దేశంలో ప్రదర్శింపబడే హక్కు లేదంటూ 'ఖతార్' ప్రభుత్వం ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో రేపు విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa