SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి అన్ని చోట్ల నుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియాభట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా సినిమా మొదట హిందీలో అడ్వాన్స్ బుకింగ్స్ స్లో అయినప్పటికీ, ఈ సినిమా భారీ వసూలని రాబటింది. ఈ సినిమా నార్త్ లో సెన్సషనల్ రికార్డులని సృష్టిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఒక్క హిందీలోనే 250 కోట్లు రాబటింది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa