ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్ బస్టర్ సినిమా ఎలా తీయాలో చూపిస్తా

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 01:29 AM

బ్లాక్ బస్టర్ సినిమా ఎలా తీయాలో దేశ్ ద్రోహి-2 చిత్రంతో చూపిస్తానని బాలీవుడ్ విమర్శకుడు, నటుడు కమాల్ ఆర్ ఖాన్ పేర్కొన్నాడు. గతంలో వలసదారుల సమస్యపై ఆయన 'దేశ్ ద్రోహి' చిత్రం తెరకెక్కించాడు. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ తీస్తానని చెబుతున్నాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి తానేనని, దర్శకత్వం కూడా తానే వహిస్తానని వెల్లడించాడు. బ్లాక్ బస్టర్ సినిమా ఎలా తీయాలో దేశ్ ద్రోహి-2 చిత్రం ద్వారా బాలీవుడ్ కు మార్గదర్శనం చేస్తానని పేర్కొన్నాడు. తన కొత్త చిత్రం బాహుబలిని మించి ఉంటుందని చెప్పాడు. త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందని కమాల్ ఆర్ ఖాన్ వెల్లడించాడు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా పంచుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa