ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తలపతి66' లో కీలక పాత్రలో కనిపించనున్న ప్రముఖ తమిళ నటుడు

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 10:52 AM

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి  తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా "తలపతి66" అని టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని సమాచారం. ఈ తెలుగు-తమిళ సినిమా చెన్నైలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించబడింది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు మోహన్‌ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తలపతి విజయ్‌కి ఈ సినిమాలో అన్నయ్యగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa