వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని "అంటే సుందరానికి" అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకుంది అని కొన్ని రోజుల క్రితం మేకర్స్ వెల్లడించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు.
సినిమా టీజర్ కూడా ఫుల్ ఫన్ రైడ్ లో ఉంది. నాని రోల్ డెవలప్‌మెంట్ నుండి లాస్ట్ వరకు లవ్లీ ఫన్ అని చెప్పారు. అలాగే హీరోయిన్ నజ్రియా, నాని మధ్య చిన్న లైన్‌తో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి. మరి దాన్ని ఎలా డీల్ చేశారో సినిమాలో చూడాలి. అలాగే లాస్ట్‌లో నటుడు హర్షవర్ధన్‌తో బ్యూటీఫుల్‌గా చెప్పే సన్నివేశాలు, సినిమా టైటిల్‌కి న్యాయం చేసే విజువల్స్ నవ్వించాయి. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో జూన్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Action took over the first half.
Let love and laughter takeover the second
June 10th. 2022#AnteSundaraniki TEASERhttps://t.co/GSMMzd3dqB #NazriyaFahadh #VivekAthreya @oddphysce @MythriOfficial @arunasays @hasithgol @saregamasouth
— Nani (@NameisNani) April 20, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa