వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం "అంటే సుందరానికి" అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకుంది అని కొన్ని రోజుల క్రితం మేకర్స్ వెల్లడించారు. తాజగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మలయాళీ బ్యూటీ నజ్రియా ఫహద్ మాట్లాడుతూ.... తను ట్యూటర్ సహాయంతో తెలుగు నేర్చుకుంటున్నానని మరియు మలయాళంతో పాటు తెలుగులో కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పానని వెల్లడించింది. ఈ రోమ్-కామ్ సినిమాని మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 10, 2022న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa