క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ పూరీ జగన్నాధ్ భారతీయ చలనచిత్రంలో విజయవంతంగా 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సెన్సషనల్ డైరెక్టర్ 'బద్రి' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ అండ్ అమీషా పటేల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా 22 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 20న విడుదలైంది. ఆ తర్వాత పూరి చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు అండ్ అభిమానులు సోషల్ మీడియాలో దర్శకుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బద్రి, శివమణి, పోకిరి, బిజినెస్ మ్యాన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమాలకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే ప్రధాన పాత్రలలో నటిస్తున్న 'లైగర్' సినిమా విడుదల కోసం వేచి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa