మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ సమంత ఒక సినిమా చేస్తున్నారన్న వార్త ఇటీవలి కాలంలో జోరుగా సాగుతుంది. ఈ సినిమాపై రోజుకొక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ నిన్ననే ఈ మూవీ ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ లో లాంఛనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు, కానీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత, కీలక పాత్రలు పోషిస్తున్న రాహుల్ రామకృష్ణ లు ఈ వేడుకలో మిస్ అయ్యారు. దీంతో పూజా కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా కలిసి దిగిన ఫొటోకు ఈ ముగ్గురి ఫోటోలను యాడ్ చేసి సోషల్ మీడియాలో విజయ్ పోస్ట్ చేసాడు. నిజమైన పూజ ఫోటో ఇదే. పత్రికలవారు కూడా ఈ ఫోటోనే షేర్ చెయ్యండంటూ ట్వీట్ చేసాడు. పూజా కార్యక్రమానికి ఎగ్గొట్టిన వాళ్ళను టీజ్ చేసేందుకే విజయ్ ఇలా చేసాడని తెలుస్తోంది.
పోతే... కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో నడిచే అందమైన ప్రేమ కథగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. విజయ్ కెరీర్లో ఇది 11 వ సినిమా కావటంతో #VD 11 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను పిలుస్తున్నారు. మలయాళ మ్యూజిక్ సంచలనం అబ్దుల్ వాహబ్ ను ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa