కన్నడ చిత్రంగా విడుదలైన కేజీఎఫ్ 1 సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల వచ్చిన కేజీఎఫ్ 2 కూడా అదే విధంగా సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లను సాధించింది. ఏడు రోజుల్లో 700కోట్లను కొల్లగొట్టి ప్రభంజనం సృష్టిస్తుంది. బాలీవుడ్లో రికార్డు కలెక్షన్లను రాబడుతూ, 300 కోట్లకు చేరువవుతూ అక్కడి సినిమాలకు కేజీఎఫ్ 2 ఒక పీడకల గా మారింది. అలానే ఇరు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకూ రూ. 61 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇటీవల తెలుగులో విడుదలైన కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు పెద్దన్న, ఈటి, వలిమై, బీస్ట్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి కేజీఎఫ్ 2 తెలుగు నేలపై సెన్సేషన్ రికార్డును నమోదు చేయటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయి వసూలు రావడమంటే మాములు విషయం కాదు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధిశెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa